NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులే భవిష్యత్ భారత నిర్మాణ శిల్పులు : ఎమ్మెల్యే కోట్ల

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని ఏనుగుమర్రి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచి మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన రాగనిత్య, మనీషా ,లహరి ,హర్షవర్ధన్ మరియు ఇతర విద్యార్థులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో   డోన్ ఎమ్మెల్యే  కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులను అభినందించి, వారి కృషి, పట్టుదల ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివితే గొప్ప విజయాలు సాధించవచ్చని పేర్కొన్నారు.విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని హామీ ఇచ్చారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించి వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అభినందించారు. ఈకార్యక్రమంలో ఆర్డీవో, తాసిల్దార్ భారతి, సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరామిరెడ్డి, ఎంఈఓ లు వెంకటేశ్వర నాయక్, మహేశ్వర్ రెడ్డి, తెదేపా మండల ఇన్చార్జి ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి, తెదేపా సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ యాదవ్, మండల కన్వీనర్ సుదర్శన్, పట్టణ కన్వీనర్ కొంగనపల్లి, ఎపి ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి మదు కుమార్, తెదేపా నాయకులు రామకృష్ణ, రామ్ భూపాల్, శివశంకర్ మరియు కూటమి నాయకులు,కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *