NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యోగాతోనే ఆరోగ్యం..

1 min read

– డాక్టర్ మాకాల సత్యనారాయణ

గుంటుపల్లి, న్యూస్ ​నేడు  : 12వ అంతర్జాతీయ యోగా డే 2026 ఉత్సవాలలో భాగంగా  ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి జడ్పీ హైస్కూల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ అంతర పంచభూతాలుగా పనిచేసే మానవ 12 అవయవాలను సమన్వయ పరచడమే యోగ ఆరోగ్యం అని తెలిపారు.వేల సంవత్సరాలుగా భారతదేశంలో వాడబడి, డాక్యుమెంట్ చేయబడి, అనేకమంది దీనిపై పరిశోధన చేసి, నిరూపించబడిన ఆరోగ్య విధానం. ఆధునిక కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆలస్యమైన గుర్తింపు, మరియు ఆదరణ తగ్గటం ప్రపంచ ఆరోగ్య వినాశనానికి కారణమై, ప్రజలు ఎప్పటికీ తగ్గని రుగ్మతలతో ప్రపంచవ్యాప్తంగా బాధపడుతున్నట్లు చెప్పారు. మానవ లివర్ మరియు గాల్బ్లెడర్ పంచభూతాల్లో ఆకాశంల పనిచేస్తాయని వీటిలో వచ్చే ఎచ్చుతగ్గులు పగలు రాత్రిలా ఉంటాయని ఈ ఎచ్చు,తగ్గులే కళ్ళు మరియు మజిల్స్ అండ్ టెండన్స్ లో అనారోగ్యం తెచ్చి పెడతాయని, వీటి సమస్థితికి తేవటం వల్ల కళ్ళు, మజిల్స్ అండ్ టెండన్స్ సమస్యలు తగ్గుతాయని చెప్పారు. కిడ్నీ మరియు యూరినరీ బ్లాడర్ లు పంచభూతాల్లో( వాటర్) నీరుగా పనిచేస్తాయని, వీటి హెచ్చుతగ్గులు చెవులు , ఎముకలు, జుట్టు మరియు పునరుత్పత్తిలో సమస్యలు వస్తాయని,ఊపిరితిత్తులు మరియు పెద్ద ప్రేగుల మధ్య సమన్వయ లోపం ముక్కు మరియు స్కిన్ సమస్యలు వస్తాయని తెలిపారు. ఉదరము మరియు ప్లీహముల సమన్వయ లోపం, నోరు మరియు కాళ్లు, చేతుల బలహీనత వస్తాయని, హార్ట్, పెరికార్డియమ్,చిన్నప్రేగులు మరియు ట్రిపుల్ హీటర్ల వ్యత్యాసం నాలుక, బ్రెయిన్, రక్త సరఫరాలలో ఇబ్బంది ఏర్పడి అనారోగ్యం వస్తుందని డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. యోగా లోని ప్రాణమయ కోశా ఆరోగ్య విధానాలు అతి తేలిగ్గా ఈ 12 అంతర పంచభూతాలుగా పనిచేసే అవయవాలను సమస్థితికి తేవడంతో,తెలిసిన, అనారోగ్యం,తెలియని అనారోగ్యం మరియు రాబోయే అనారోగ్యం తగ్గిపోతాయని, దీనితో యోగ ఆరోగ్యం, ఆనందం మరియు దీర్ఘాయుష్ సిద్ధిస్తుందని భారతీయులు నిరూపించారని తెలిపారు. కరోనాకాలంలో భారతీయులు తక్కువ సావులకు ఈ విధానాలే కారణమని తెలిపారు. గుంటుపల్లి జడ్పీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు సంధ్యారాణి మాట్లాడుతూ విద్యార్థులు ఈరోజే డాక్టర్గా మారి  వారి ఆరోగ్యంతో పాటు కుటుంబానికి సాయం చేసే లాగా తయారయ్యారని, దీనికి డాక్టర్ మాకాల సత్యనారాయణ కు కృతజ్ఞతలు చెప్పి, ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో విద్యార్థులు, టీచర్లు, యోగ గురువులు బి.పద్మిని, కే. సుమతి,పారిశ్రామికవేత్త కానూరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  అందరికి మోడీ ఫిట్నెస్ మంత్ర పరికరాలు పంపిణి చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *