NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” లో భాగంగా మెడికల్ కాలేజీలో “ఆపరేషన్ క్లీన్ స్వీప్”

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ ఆంధ్ర నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాద్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు  కర్నూల్ మెడికల్ కాలేజీలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా వైద్య విద్యార్థులు సిబ్బంది భవనాల పైభాగంలో ఉన్న చెత్తాచెదారాన్ని శుభ్రం చేయడం జరిగింది. వర్షా కాలం కావున బవనాలపై ఉన్న వాటర్ ఔట్లెట్ లను క్లియర్ చేయడం జరిగింది.  కాలేజీ పరిసరాల్లో ఉన్న అపరిశుభ్ర ప్రాంతాలను శుభ్రం చేయడం జరిగింది . అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రి అయిన పర్ల గ్రామం లోని ఆర్ హెచ్ టిసి యందు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ పచ్చని మొక్కలతోనే పర్యావరణానికి రక్షణ అని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని విరివిరిగా మొక్కలు నాటాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ లు డా.హరి చరణ్, డా. సింధియా శుభప్రద, ఆర్ హెచ్ టిసి  పర్ల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శైలజ, అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డా. అరుణ, డా. రేణుక, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. రవి నాయక్, డా. నాగరాజు, డా. వైష్ణవి డాక్టర్ ప్రసన్న రాణి, లెక్చరర్లు సురేష్ కుమార్, భవాని ప్రసాద్, సరిత, ఇంజనీర్ రాజశేఖర్, హెల్త్ ఎడ్యుకేటర్ షణ్ముఖుడు సూపర్వైజర్ మాధవ రాజు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *