NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జూన్ 20న ఏ.పి.రెవెన్యూ  సర్వీసెస్ అసోసియేషన్ ఆద్వర్యంలో “రెవెన్యూ డే”

1 min read

జిల్లా అధ్యక్షులు అయిన కె. రమేష్ కుమార్

ఈస్ట్ ఇండియా పాలకులు 1786 వ సం జూన్ 20న  రెవెన్యూ బోర్డు ఏర్పాటు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రెవెన్యూ డే సందర్భముగా ఈ రోజు స్థానిక రెవెన్యూ భవనము, ఏలూరు నందు “రెవెన్యూ డే” ని ఏ.పి. రెవెన్యూ  సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అయిన కె. రమేష్ కుమార్ ఆద్వర్యములో గణముగా నిర్వహించడము జరిగినది.సదరు కార్యక్రమును పురస్కరించుకొని జిల్లా అధ్యక్షులు  కె.రమేష్ కుమార్ మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్యం రాక ముందు ఈస్ట్ ఇండియా పాలకులు 1786 వ సం:జూన్ -20 వ తేదిన  రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేశారని, ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కృషి ఫలితముగా 238 సంవత్సరములు తరువాత జూన్-20 వ తేదిని ప్రతి సంవత్సరము “రెవెన్యూ డే” గా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము  ఉత్తర్వులు జారిచేసినదని, అన్ని శాఖలకు తల్లి వంటి రెవెన్యూ శాఖ ఔన్నత్యాన్ని మరింతగా పెంచేందుకు , రెవెన్యూ శాఖ గొప్పతనాన్ని మరియు రెవెన్యూ శాఖ ప్రజలకు చేయుచున్న విశిష్ట సేవలను ప్రతి ఒక్కరికి తెలిపేందుకు, ప్రతి రెవెన్యూ ఉద్యోగులలో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ రెవెన్యూ దినోత్సవం జరుపుకోనుచున్నాము అని మరియు  విశ్వ వ్యాప్తం గా రెవెన్యూ శాఖకు గుర్తింపు పొందడం కోసం మన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కృషి అమోఘం అని మరియు జిల్లా కలక్టర్ స్థాయి నుండి వి ఆర్ ఏ స్థాయి వరకు రెవెన్యూ ఉద్యోగి అహర్నిశలు పని చేస్తూ ప్రజలకు సేవ చేస్తుంటారని రానున్న రోజుల్లో ఈ దినోత్సవం మరింత విస్తృతం అయ్యి, అనేక కొత్త పుంతలు తొక్కాలని ఆశిస్తూ అదేవిధముగా ప్రస్తుతము ప్రభుత్వమూ వారు ఎంతో ప్రోత్సహకరముగా రెవెన్యూ డే ని జరుపుకోనుటకు బడ్జెట్ రిలీస్ చేసినందుకు దన్యవాదములు తెల్పియున్నారు.    సదరు కార్యకరములో ఏ. ప్రమోద్ కుమార్, సెక్రెటరి, ఏ.పి. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏలూరు జిల్లా వారు మాట్లాడుతూ రాత్రనక, పగలనక శ్రమించే రెవెన్యూ ఉద్యోగులు  ప్రజలకు సమర్ధవంతమైన సేవలను అందించే కృత్యంలో పునరంకితం అవుతారని ఆశిస్తూ  సదరు రెవెన్యూ డే సందర్భముగా రిటైర్డ్ అయ్యిన ఉద్యోగులను సన్మానించడము జరిగినది సన్మానగ్రహితలు            వి.వి.జగన్ మోహన్ రావు, మెట్టు రామ్ మోహన్ రావు, సోమశేఖర్ రావు, ఎం.ఎచ్. మణి, టి.మైఖేల్ రాజు, ఏ.పి. దుర్గా రావు, , ఏ.వి. రామాంజనేయులు, జి.వి. సుబ్బారావు. ఎం. రాజశేఖర్, రామకృష్ణ, బి. రామారావు, వై. అమిన్సిలా. ఈ కార్యక్రమములో రవిచంద్ర రావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్, కృష్ణ స్వామి ఏలూరు డివిజన్ ప్రెసిడెంట్, మాధవి జిల్లా వైస్ ప్రెసిడెంట్,  పి. నాజీమ బేగం, జిల్లా జాయింట్ సెక్రటరీ, ASKV అప్పారావు, ఏలూరు డివిజన్ సెక్రటరీ  మరియు జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *