ఎస్టీ కమిషన్ దృష్టి కి పలు సమస్యలుపై వినతి
1 min read
మైదాన ప్రాంతానికి చెందిన పలువురు గిరిజనులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నరు
ఎస్టి ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్:దేవరకొండ వెంకటేశ్వర్లు
ఎస్టీలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యని సమర్థవంతంగా తగిన సమయంలో పరిష్కరిస్తా
ఏపీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జి రెడ్డి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జి రెడ్డి,సభ్యులు కాకి లక్ష్మి, గొర్లె సునీతలకు ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు ఏలూరులో శనివారం ఉదయం ఘన స్వాగతం పలికారు. నిరాధర ఉద్దేశపూర్వక ఆరోపణలు, తీవ్ర వివక్షతో ఆదివాసీ వర్గానికి చెందిన ఆర్టీసీ చిరుద్యోగి జగన్నాథం బాలరాజును విధుల నుంచి తొలగించడం అత్యంత హేయమని కమిషన్ ఎదుట సదరు బాధిత కుటుంబం వాపోయింది. ఏలూరు శనివారపు పేటలో ఎస్టీకి చెందిన యరసాని రాటాలు స్వర్జాపు 86 చదరపు గజాల నివాస స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించిన ఒక వ్యక్తిపై కమిషనకు ఫిర్యాదు ఇవ్వడమైనది.మైదాన ప్రాంతానికి చెందిన పలువురు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘం ఆధ్వర్యంలో ఎస్టీ కమిషన్ దృష్టిలోకి తీసుకెళ్ల డమైనది.కమిషన్ చైర్మన్,సభ్యులు సమస్యలను సావధానంగా విని సానుకూలంగా స్పందిస్తూ ఎస్టీలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యని సమర్థవంతంగా తగిన సమయంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్టి ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్:దేవరకొండ వెంకటేశ్వర్లు,సంఘం గౌరవ సలహాదారులు తిమ్మసర్తి నాగేశ్వరరావు,రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగిలి శ్రీనివాసరావు,అమల దాసు మురళి,జగన్నాథం అంజలీదేవి, టి.వశిష్ట తదితరులు పాల్గొన్నారు.

