రాయలసీమ యూనివర్సిటీ లో యోగ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రాయలసీమ యూనివర్సిటీ లోని ఎన్ఎస్ఎస్ జాతీయ సేవాసమితి మరియు మై భారత్ వారు ఓపెన్ ఆడిటోరియం లో నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యం లేకుండా యోగా అనే అంశంతో జరిగిన కార్యక్రమంలో రాయలసీమ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ వి వెంకట బసవరావు హాజరు కావడం జరిగింది. ఆయన మాట్లాడుతూ చదువులతో పాటు ఏకాగ్రత పెరగాలంటే విద్యార్థులు అందరూ యోగ ఆసనాలు నేర్చుకుని అమలు చేయాలని తెలిపారు శారీరక ఆరోగ్యం మెరుగుపడాలన్న లేదా అనారోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా యోగ ఎంతో చాలా అవసరం అని, ప్రస్తుతం నేను ఆన్లైన్ లో యోగ క్లాసులు ఫాలో అవుచున్నానని వారు తెలిపారు యూనివర్సిటీ విద్యార్థుల కొరకు ప్రతి శనివారం ఒక పీరియడ్ యోగ టైమ్ టేబుల్ లో పెట్టి అమలు చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో నంద్యాల వై సి టీ యోగా కేంద్రం నిర్వాహకులైన యోగా గురువులు జగన్మోహన్ రెడ్డి సూర్య నమస్కారములు నుంచి శవాసనం వరకు మరియు మానసిక ప్రశాంతత పాటు శారీరక దృఢత్వం శ్వాసక్రియ మెరుగుదల ద్వారా శరీరాన్ని మనసును ప్రశాంతతను నెలకొలుపు కొవచ్చు అని చెప్పారు యోగసాధన ద్వారా గుండె జబ్బులు పక్షపాతం బీపీ నియంత్రణ మొదలగు జబ్బులు దరిచేరవు అని తెలియజేశారు కుమారి రమ్యశ్రీ అభినయము చేయిస్తూ యోగాసనాలను అందరితో సాధన చేయించారు మై భారత్ వారు యోగ పై పోటీలను నిర్వహించారు ఇందులో పాల్గొన్న విద్యార్థులకు మెమొంటోలు సర్టిఫికెట్లు ఉపకులపతి చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆచార్యులు రిజిస్ట్రార్ విజయకుమార్ నాయుడు ప్రొఫెసర్ కృష్ణారెడ్డి ప్రొఫెసర్ భరత్ కుమార్ మరియు యూనివర్సిటీ ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్లు డాక్టర్ కవిత ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ వెంకటరత్నం ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ శివ కిషోర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ డాక్టర్ వి రవిశంకర్ ఎస్ నాగభూషణం బోధన బోధనేతర సిబ్బంది యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొని యోగ కార్యక్రమము ను దిగ్విజయంగా ముగించారు.

