NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీట్ పరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాం

1 min read

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు:  నీట్ పరీక్షను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.ఆదివారం స్థానిక ఇందిరాగాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాలలో, కేవిఆర్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తున్న నీట్ పరీక్ష నిర్వహణను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీట్ పరీక్షను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు తదితర మౌలిక వసతులు అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని  కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్ష సజావుగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు విద్యాశాఖ, పోలీసు, వైద్య, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author