ప్రజాసేవకు దక్కిన అపూర్వ గౌరవం
1 min read
పుట్టరాజ గవాయి పుణ్యాశ్రమం నుంచి ఈబీజీ గోవింద్ గౌడ్‌కు ప్రత్యేక ఆహ్వానం
జూలై 5న వేలాది భక్తుల సమక్షంలో ఘన సన్మానం
అధికారిక ఆహ్వాన పత్రికలో ప్రత్యేక స్థానం – హొళగుందకు దక్కిన గౌరవం
హోళగుందన్యూస్ నేడు: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ప్రజాసేవకు చిరునామాగా నిలిచిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు ఈబీజీ గోవింద్ గౌడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. కర్ణాటక రాష్ట్రంలోని గదగ్ జిల్లా ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ పుట్టరాజ గవాయి పుణ్యాశ్రమం ప్రతినిధులు ప్రత్యేకంగా కలిసి శాలువాతో సన్మానించి, మఠం గురువుల చిత్రపటంతో పాటు అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు.సమాజ సేవ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పేద ప్రజలకు అండగా నిలుస్తూ నిరంతరం చేస్తున్న సేవలను గుర్తించిన పుట్టరాజ గవాయి పుణ్యాశ్రమం కమిటీ సభ్యులు ఈ గౌరవాన్ని ప్రకటించారు. మంజు జీరా వీరేష్, ఎల్. గణేష్, సి. చంద్రబసవ, బి. బసవరాజ్ తదితరులు ఈబీజీ గోవింద్ గౌడ్‌ను కలిసి మహోత్సవాలకు ఆహ్వానించారు.కర్ణాటక రాష్ట్రంలోని గదగ్‌లో ఉన్న శ్రీ పుట్టరాజ గవాయి పుణ్యాశ్రమంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించే జాతర, రథోత్సవ మహోత్సవాలు ఈ ఏడాది కూడా భక్తిశ్రద్ధల మధ్య జరగనున్నాయి. ఈ మహోత్సవాల సందర్భంగా జూలై 5వ తేదీన నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ప్రస్తుత పీఠాధిపతి శ్రీ కల్లయ్య అజ్జా చేతుల మీదుగా ఈబీజీ గోవింద్ గౌడ్‌కు ఘన సన్మానం జరగనుంది.మఠం విడుదల చేసిన అధికారిక ఆహ్వాన పత్రికలో ఈబీజీ గోవింద్ గౌడ్ పేరు ప్రత్యేకంగా ముద్రించడం ఆయన ప్రజాసేవకు లభించిన గొప్ప గుర్తింపుగా భావిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు, పేదల సంక్షేమం, విద్యార్థులకు సహాయ సహకారాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం చురుకుగా వ్యవహరిస్తూ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడిగా గుర్తింపు పొందారు.ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న నాయకుడికి ఆధ్యాత్మిక సంస్థ నుంచి వచ్చిన ఈ విశిష్ట గౌరవం ఆలూరు నియోజకవర్గంతో పాటు హొళగుంద మండల ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.ప్రజా సేవా రంగంలో మరిన్ని విజయాలు సాధిస్తూ, సమాజానికి మరింత సేవ చేసే అవకాశాలు లభించాలని ఆకాంక్షిస్తూ పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈబీజీ గోవింద్ గౌడ్‌కు లభించిన ఈ గౌరవం ప్రజాసేవకు దక్కిన గుర్తింపుగా నిలిచిపోతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


