అధిక ధరల నియంత్రణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
1 min read
సిపిఐ ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారత కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సమావేశం కొల్లూరి సుధారాణి 7 అధ్యక్షతన ఆర్ఆర్ పేట స్ఫూర్తి భవన్ నందు జరిగినది. ఈ సమావేశంలో పాల్గొన్న ఉప్పులూరు హేమ శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా జరిగిపోయిన నిత్యవసర వస్తువుల ధరలు తక్షణమే తగ్గిస్తామని హామీ 32 ) రెండు సంవత్సరాలు పూర్తయిన ధరలను మాత్రం నియంత్రించ లేకపోయిందని విమర్శించారు. ప్రజలు పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరల వలన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను సబ్సిడీపై పేద ప్రజలకు అందించే వారని, కూటమి ప్రభుత్వం కూడా రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీపై ప్రజలకు నిత్యవసర వస్తువులను అందించాలని డిమాండ్ చేశారు. ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శులు కురెళ్ళ వరప్రసాద్, అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యులు మావూరి విజయ, గొర్లి స్వాతి, కొల్లూరి సుధారాణి పాల్గొన్నారు.

