పెద్ద ఎత్తున శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు
1 min read
వివిధ సేవల రూపేణా రూ.3,75,340/-లు ఆదాయం
ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షులు రాజాన సత్యనారాయణ
సుమారు 2397 భక్తులకు నిత్యాన్నదాన సత్రoలో అన్నప్రసాద వితరణ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము మంగళవారం సందర్భముగా చుట్టు ప్రక్కల గ్రామముల నుండియే గాక సుదూర ప్రాంతముల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీ స్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీ స్వామి వారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించుకునినారు. ఈ రోజు మద్యాహ్నం గం.3-30 ని.ల వరకూ శ్రీ స్వామి వారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణా రూ.3,75,340/- లు ఆదాయము వచ్చినదని ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షులు రాజాన సత్యనారాయణ మరియు ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి చందన తెల్పినారు.ఈ రోజు శ్రీ స్వామి వారి దర్శనార్ధం మద్యాహ్నం గం.3-00 వరకూ విచ్చేసిన సుమారు 2397 భక్తులకు శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రము నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. శ్రీ స్వామి వారి నిత్య అన్నదాన సత్రంనందు అన్నదానమును ఆలయ ధర్మకర్తలమండలి ఛైర్మన్ రాజాన సత్యనారాయణ, ధర్మకర్తలు శ్రీ చింతపల్లి రత్నసురేష్, శ్రీ ధూళిపాళ్ల సూర్యచంద్ర వెంకట ప్రభాకరరావు,వల్లూరి సునీత, శ్రీమతి తిరుమలశెట్టి నాగ వరలక్ష్మి అనీల, జగన్నాధం వెంకటమ్మ మరియు ఆలయ ఎక్స్.అఫిషియో మెంబర్ వేదాంతం వెంకటాచార్యులు స్వయంగా పరిశీలించి భక్తుల నుండి సూచనలు సలహాలు అడిగి తెలుసుకొని, భక్తులతో పాటుగా అన్న ప్రసాదము స్వీకరించియున్నారు.జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు రాయనేని భాస్కరరావు వారి కుమార్తె రాజరాజేశ్వరి అల్లుడు మండవ రవి మరియు మనవడు చి:సిద్దార్ధ్ పేరున శ్రీ స్వామివారి దేవస్థానం నందు జరుగు శాశ్వత నిత్య అన్నదానమునకు రూ.1,01,116/- లు విరాళముగా ధర్మకర్తల మండలి అద్యక్షులు రాజాన సత్యనారాయణ మరియు ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి. చందన తెల్పినారు.శ్రీ స్వామి వారి దర్శనార్ధం పర్యవేక్షక ఇంజనీరు వారు కుటుంబ సమేతంగా వచ్చియున్నారు. వారికి ఆలయ మర్యాదలతో ధర్మకర్తల మండలి అద్యక్షులు రాజాన సత్యనారాయణ, ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి. చందన స్వాగతం పలికిన అనంతరం వారు శ్రీ స్వామి వారికి పూజలు నిర్వహించియున్నారు. తదుపరి వారికి వేద ఆశీర్వచనము చేసిన తరువాత శ్రీ స్వామి వారి తీర్ధ ప్రసాదములు మరియు స్వామి వారి చిత్రపటము అందించియున్నారు. తదుపరి శ్రీ స్వామి వారి దేవస్థానములో జరుగుచున్న వివిధ అభివృద్ది పనులను పరిశీలించి తగు సూచనలు ఇచ్చియున్నారు.


