భక్తిశ్రద్ధలతో మొహరం వేడుకలు
1 min read
తుంగభద్ర నది లో పీర్ల దేవుళ్లను నిమజ్జనం
మంత్రాలయం న్యూస్ నేడు : నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో శుక్రవారం మొహరం వేడుకలు కులమతాలకుఅతీతంగా ఖాజా హుస్సేన్ తాత, ముల్లా సాబ్ పింగాణి ఖాజా అధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా మొహరం నెల ప్రారంభమైన రోజు నుండి అసర్ ఖానా లో కొలువైన హసన్ హుశేన్, ఇమాం ఖాశీం పీర్ల దేవుళ్లను గ్రామ ప్రజలు కులమతాలకుఅతీతంగా పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పదవ రోజు మొహరం వేడుకలు హసన్ హుశేన్, ఇమాం ఖాశీం పీర్ల దేవుళ్లను భాజభజంత్రీల మద్య సంత మార్కెట్ మీదుగా తుంగభద్ర నది లో పీర్లను నిమజ్జనం చేశారు. అక్కడ ప్రత్యేక ఫాతేహాలు (పూజలు) చేశారు. ముందుగా టిడిపి మండల కన్వీనర్ పన్నగ వెంకటేష్ స్వామి, టౌన్ అధ్యక్షులు వరదరాజులు, ఎంపిటిసి మేకల వెంకటేష్, వట్టేప్ప నర్సింహులు, వట్టేప్ప రఘు, నరసింహ, రఘు, సున్నం రాఘు, సిద్ధు, దస్తగిరి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై మల్లికార్జున అధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ మురళిధర్ రెడ్డి, కానిస్టేబుల్ యల్లప్ప బందోబస్తు నిర్వహించారు. అలాగే మండల పరిధిలోని మాధవరం, మాలపల్లి, రచ్చమరి, వగరూరు, తుంగభద్ర, రాంపురం, చిలకలడోణ, సూగురు, తిమ్మాపురం, పలు గ్రామాల్లో మొహరం వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ మంత్రాలయం ఎస్సై మల్లికార్జున, మాధవరం ఎస్సై విజయ కుమార్ అధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


