ఎస్.ఐ.ఆర్ ప్రక్రియకు ప్రజలు సహకరించాలి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఎస్.ఐ.ఆర్ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) కు ప్రజలందరూ సహకరించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో కులం, మతంతో సంబంధం లేదని, అందరూ ఈ కార్యక్రమంలో బి.ఎల్.ఓలకు సహకరించి వివరాలు అందజేయాలని సూచించారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ ఏ ఒక్క కులానికి, మతానికి మినహాయింపు కాదన్నారు. కావున నిర్దిష్ట గడువులోగా ప్రతి ఓటరు తమ వివరాలు బి.ఎల్.ఓలకు అందజేయాలని ఆయన కోరారు. అధికారులు సైతం ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

