NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కురువల్లిలో ఉపాధి హామీ సదస్సు ఘనంగా నిర్వహణ

1 min read

పాల్గొన్న ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు మండలం కురువల్లి గ్రామంలో “వికసిత్ భారత్ – 125 రోజుల గ్రామీణ ఉపాధికి మెరుగైన హామీ” కార్యక్రమం సందర్భంగా ఉపాధి హామీ సదస్సు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి, ఆలూరు మండల కన్వీనర్, ఎంపీడీవో ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో సమావేశమై పథకం అమలు, గ్రామీణ ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ, గ్రామీణ పేద కుటుంబాలకు ఏడాదికి 125 రోజుల ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు పెంచి, కూలీల వలసలను తగ్గిస్తూ వారికి స్థిరమైన ఆదాయం అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. అధికారులు కూడా ఉపాధి హామీ పథకాన్ని ప్రతి అర్హ కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు అధిక సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

About Author