NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మరోసారి రోడ్డెక్కిన దస్తావేజుల లేఖర్లు

1 min read

రిజిస్ట్రేషన్ విభాగాన్ని పిపిపి విధానం ద్వారా ప్రయివేటు పరం చేయొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్

మరోసారి రోడ్డెక్కిన దస్తావేజుల లేఖర్లు

రిజిస్ట్రేషన్ లపై ఆధార పడి

రాష్ట్రంలో  లక్ష  లేఖర్ల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన

రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు

ఏలూరుజిల్లా ప్రతి నిధి,న్యూస్ నేడు: దస్తావేజుల లేఖర్లు మరోసారి రోడ్డెక్కారు,రిజిస్ట్రేషన్ విభాగాన్ని పి పి పి విధానం ద్వారా ప్రయివేటు పరం చేయొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,ఏలూరు రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద బుధవారం దస్తావేజుల లేఖర్ల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు నేతృత్వం లో దస్తావేజుల లేఖర్లు  ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు,ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, భూముల రిజిస్ట్రేషన్ లను ప్రభుత్వం పి పి పి విధానం లో ప్రయివేటు పరం చేస్తే రిజిస్ట్రేషన్ ల పై ఆధార పడి వాటినే ఉపాధి అవకాశాలుగా నమ్ముకుని ఏళ్ల తరబడి ఉపాధి పొందున్న రాష్ట్రంలో  లక్ష దస్తావేజుల లేఖర్ల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు,ప్రభుత్వం వెంటనే రిజిస్ట్రేషన్ విభాగాన్ని పి పి పి పద్ధతి లో ఫ్రీవేటుపరం చేసే ఆలోచన విరమించుకోవాలని,పి పి పి విధానం పేరుతో దస్తావేజుల లేఖర్ల పొట్ట కొట్ట వద్దని పెనుమాక వెంకట సుబ్బారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా దస్తావేజులేఖరులు, స్టాంపు వండర్లు, డీటీపీ ఆపరేటర్లు వారి ఉపాధిని కాపాడాలని  పెద్ద ఎత్తున నినాదాలతో అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *