వి.బి.జి. రామ్‌జీ కార్యక్రమం ఘనవిజయం
1 min read
గ్రామాభివృద్ధి – ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం : చిన్నహ్యాట శేషగిరి
హోళగుందన్యూస్ నేడు: కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “వి.బి.జి. రామ్‌జీ” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ప్రజా నాయకుడు, తెలుగు యువత రాష్ట్ర మాజీ కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చిన్నహ్యాట శేషగిరి, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తిప్పయ్య, మాజీ సర్పంచ్ రాజా పంపన్న గౌడ్, కోనేరు తిమ్మయ్య ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల విస్తరణ, గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.అనంతరం అధికారులు కార్యక్రమం అమలు విధానం, పనుల ప్రాధాన్యత, గ్రామీణాభివృద్ధికి కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఏపీవో తిమ్మారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ మంజునాథ్, టెక్నికల్ అసిస్టెంట్ (టీ.ఏ.) మల్లన్న, గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


