కూటమి ప్రభుత్వ విజయపథంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం
1 min read
ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడి
గత గొడ్డలి పార్టీ దుర్మార్గపు పాలనను తరిమికొట్టడంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిది
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గత వైసిపి ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు,12వ పీఆర్‌సీ, 4 డీఏల విడుదల, సరెండర్ లీవ్స్ బకాయిల పరిష్కారంపై ఏలూరు జిల్లా జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి వినతిపత్రం అసోసియేషన్ నాయకులు అందించారు.రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నా కూడా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ దిశగా కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది – అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చింతమనేని భరోసా ఉద్యోగులకు కల్పించారు.రాష్ట్ర పునర్నిర్మాణంలో మరియు కూటమి ప్రభుత్వ ప్రజారంజక పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు అత్యంత కీలకమైన భాగస్వాములని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ప్రశంసించారు. గురువారం దుగ్గిరాలలోని తన క్యాంపు కార్యాలయంలో నిత్య ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏపీ జెఎసి, ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ మరియు వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.
ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలం నుండి పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం చొరవ చూపాలని నాయకులు కోరారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా 2023 నుండి అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల 12వ పీఆర్‌సీ (పిఆర్ సి) నియమక ప్రక్రియ చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏ (డిఏ ) లను తక్షణమే విడుదల చేయాలని కోరారు. అలాగే గత వైసిపి ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ఉద్యోగులు, పోలీసులు మరియు ఉపాధ్యాయుల సరెండర్ లీవ్స్ బకాయిలను చెల్లించేలా చూడాలని, ఉద్యోగుల హెల్త్ కార్డుల (ఇహ్ఛ్ఎస్) క్రమబద్ధీకరణతో పాటు పలు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం అండగా నిలవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగులపై ప్రశంసల జల్లు
ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా జె ఏ సి చైర్మన్ చోడగిరి శ్రీనివాస్, రాష్ట్ర జె ఏ సి అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ ఆర్ ఎస్ హరనాధ్,యు టి యఫ్ జిల్లా కార్యదర్శి రుద్రాక్షి రవి కుమార్. ఎస్ టి యు జిల్లా కార్యదర్శి పెద్దిబోయిన నారాయణ, ఏ పి టి యఫ్ 1938 జి.మోహన్,ట్రెజరీ జిల్లా కార్యదర్శి కప్పల సత్యనారాయణ,పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు గెడ్డం గణేష్ బాబు, మెడికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరపున కడలి ఉమా మహేశ్వరరావు, దావాల నరేంద్ర, కమర్షియల్ టాక్స్ అసోసియేషన్ నుంచి పమిడిముక్కల శ్రీనివాస్, పశుసంవర్ధక శాఖ పారా వెట్స్ ఫెడరేషన్ సెక్రటరీ మేరుగ ఫణి కుమార్,పంచాయతీ రాజ్ శాఖ ఎంప్లాయిస్ మినిస్టీరియల్ జిల్లా అధ్యక్షుడు ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుడు ఏలూరు తాలుకా జె ఏ సి చైర్మన్ జి.శ్రీధర్ రాజు, ఏలూరు తాలూకా సెక్రటరీ గంటా చంద్రశేఖర్,పూడి శ్రీనివాస్.టి జయరాజు,మహిళా విభాగం ఛైర్పర్సన్ కె.సునీత,సత్య భారతి,రజిత, తేజస్విని,పద్మావతి,మీనా కుమారి,నాగమణి,సర్వ మంగళ, జ్యోతి,సునీత తదితరులు.పాల్గొన్నారు.


