NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముగ్గురు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు(ఏఓ)లు గా పదోన్నతి

1 min read

అధికారులకు అభినందలు తెలియజేసిన

జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ  ప్రసాద్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక జిల్లా పరిషత్తు చైర్ పర్సన్  క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా పరిషత్తు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఉద్యోగులకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా (ఏఓ) పదోన్నతి పత్రాలను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్తు చైర్ పర్సన్  ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ పదోన్నతి పొందిన అధికారులకు అభినందలు తెలుపుతూ,  వారి సేవలు మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించాలని ఆకాంక్షించారు. ఉద్యోగులు కృషికి తగిన గుర్తింపు లభించడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు.పదోన్నతి పొందిన వారిలో జి.సుధారాణి పదోన్నతి ఎన్నో రోజులుగా పెండింగులో ఉండగా, దీనిపై ప్రత్యేక చొరవ తీసుకుని పదోన్నతి ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నందుకు చైర్ పర్సన్ కు కృతజ్ఞతలు తెలిపారు. దృష్టి లోపం ఉన్న ఉద్యోగిగా జి.సుధారాణి న్యాయం జరిగేలా సహకరించి నందుకు బ్లైండు ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ను కలిసి ప్రత్యేకంగా అభినందిస్తూ తమ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో ఆచంట జడ్పీటీసి సభ్యులు ఉప్పలపాటి సురేష్ బాబు, జంగారెడ్డిగూడెం జడ్పీటీసి సభ్యులు పోల్నాటి శ్రీనివాసు, పదోన్నతి పొందిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *