విద్యుత్ శాఖ పిపి కరెంట్ షాక్ తో మృతి
1 min read
మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: విద్యుత్ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి కరెంట్ షాక్ తో మృతి చెందిన సంఘటన నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో చోటుచేసుకుంది.మిడుతూరు మండల పరిధిలోని వీపనగండ్ల గ్రామానికి చెందిన జుంపాల వారి సుబ్బన్న అలియాస్ కుమార్(52) విద్యుత్ శాఖలో ఉప్పలదడియ,మాసపేట, కలమందలపాడు గ్రామాల్లో పోల్ టు పోల్ (పిపి) కాంట్రాక్టు ఉద్యోగిగా గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఉప్పలదడియ గ్రామంలో శనివారంమధ్యాహ్నం 12:45 గంటల సమయంలో రైతు పొలంలో విద్యుత్ స్తంభాన్ని కరెంట్ కనెక్షన్ ఇస్తుండగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సుబ్బన్న ఎల్సీ తీసుకోకుండా విద్యుత్ స్తంభాన్ని ఎలా ఎక్కుతాడు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.మృతునికి భార్య కర్ణమ్మ,కుమారుడు సుకుమార్ ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ హెచ్ ఓబులేష్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.

