ఇక నుండి ఒకే వర్గం అదే మన టిడిపి కుటుంబ వర్గం
1 min read
కోసిగి నాడిగినేని కుటుంబం రాఘవేంద్ర వర్గం లో చేరిక
మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం న్యూస్ నేడు : ఇక నుండి మంత్రాలయం నియోజకవర్గం లో ఒకే వర్గం అని అదే మన టిడిపి కుటుంబ వర్గమని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని మాధవరం గ్రామంలో టిడిపి కార్యాలయంలో కోసిగికి చెందిన నాడిగినేని రంగన్న కుటుంబం 100 మంది కార్యకర్తలు తిక్కారెడ్డి వర్గం నుండి ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి వర్గం లో చేరారు. వీరికి రాఘవేంద్ర రెడ్డి ఆప్యాయంగా సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక్కడ నుంచి ఎవరి వర్గం అనేది కాదు ఇకపై మనందరం తెలుగుదేశం పార్టీ కుటుంబం వర్గం అని అన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా, ప్రజలకు తోడుగా కలిసి ముందుకు సాగుదామన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం, సమాన ప్రాధాన్యం ఉంటుంది” అని భరోసా ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించి అదే ఉత్సాహంతో 2029లో మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి విజయాన్ని సాధించి మరోసారి మన నారా చంద్రబాబు ను ముఖ్యమంత్రి గా చేసుకోవడం మన అందరి లక్ష్యం అన్నారు. నాడిగినేని కుటుంబం రాఘవేంద్ర రెడ్డి, రామకృష్ణ రెడ్డి లను పూలమాలలు వేసి శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాడిగినేని నర్సమ్మ, మహాదేవ, నర్సిరెడ్డి, నాగరాజు, అంజిని రెడ్డి, లక్ష్మికాంత్, రాజు, రామాంజినేయులు, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

