ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి – ఆలూరు ఎమ్మెల్యే
1 min read
చిప్పగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే శిబిర కార్యాలయంలో బూత్ స్థాయి ప్రతినిధులకు అవగాహన సదస్సు
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండల కేంద్రంలో ఉన్న ఎమ్మెల్యే శిబిర కార్యాలయంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై బూత్ స్థాయి ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి పార్టీ నాయకులు, బూత్ స్థాయి ప్రతినిధులకు పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ప్రతి బూత్ స్థాయి ప్రతినిధి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. బూత్ స్థాయి అధికారి (బీఎల్‌ఓ)తో సమన్వయం చేసుకుంటూ ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని అన్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకుడికి ఓటు నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.అలాగే ప్రతి బూత్ స్థాయి ప్రతినిధి “నా బూత్ – నా ఓటరు” మొబైల్ యాప్‌లో తప్పనిసరిగా తమ మొబైల్ నంబర్ నమోదు చేసి సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా సక్రమంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ యు. మల్లికార్జున, సహ కన్వీనర్ శేఖర్, మాజీ సర్పంచ్ ప్రేమ్ కుమార్, మండల బూత్ స్థాయి ప్రతినిధుల అధ్యక్షుడు షాకీర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

