గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన రాష్ట్ర పరిశీలకులు
1 min read
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలను సోమవారం పిఎం శ్రీ రాష్ట్ర పరిశీలకులు వెంకటేశ్వరరావు తనిఖీ చేశారు.రాష్ట్ర పరిశీలకులకు పాఠశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది ఘన స్వాగతం పలికారు.లైబ్రరీ,సైన్స్ ల్యాబ్, తరగతి గదులు,భోజనం డైనింగ్ హాల్ సోలార్ ఇన్ స్టాలేషన్ తదితర వాటిని పరిశీలించారు.కళాశాలలో అమలు చేస్తున్న పదవ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులకు అగ్రికల్చర్, ఎలక్ట్రానిక్ వృత్తి విద్య కోర్సుల్లో అనుసరించాల్సిన విధానాల గురించి వివరించారు.ఉపాధ్యాయులు చెప్పిన విధంగా విద్యార్థుల చక్కగా చదువుకొని పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ దామోదర్ రెడ్డి,ఫిజికల్ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

