NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈనెల 14న కర్నూల్ కలెక్టరేట్ ముందు ఫ్యాప్టో ధర్నా                                                       

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:  ఈనెల 14న ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఫ్యాప్టో ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం చేపడతామని డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వీజీ. వెంకట్రాముడు,    జి.  భీమన్నలు సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. 12వ పిఆర్సి అమలు చేయాలని, 30% మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను తక్షణమే విడుదల చేయాలని, అలాగే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు తదితర సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు ఐక్యంగా దసల వారి ఉద్యమాలు చేపడతామని వారు పేర్కొన్నారు.

About Author