హర్యానా మాజీ గవర్నర్ ను ఘనంగా సన్మానించిన కురువ సంఘం నాయకులు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కర్నూలు నగరానికి వచ్చారు. ఓ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన కర్నూలుకు వచ్చారు. ఈ సందర్భంగా నగరంలోని బళ్లారి చౌరస్తా వద్ద ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండారు దత్తాత్రేయ కు జిల్లా కురువ సంఘం నాయకులు ఘనస్వాగతం పలికి శాలువా కప్పి,భక్త కనకదాసు జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి, కురువ భానుశంకర్ జిల్లా ఉపాధ్యక్షులు బి. వెంకటేశ్వర్లు, పెద్దపాడు ధనుంజయ, ఉమ్మడి జిల్లా గొర్రెల సహకార సంఘం అధ్యక్షులు కె. శ్రీనివాసులు, శ్రీశైలం సత్రం ప్రధాన కార్యదర్శి అల్లూరు వెంకటేశ్వర్లు,కల్లూరు మండలం సింగిల్ విండో చైర్మన్ పర్ల శేఖర్,జిల్లా మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి కె. అనితా లక్ష్మీ నగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి బి. సి. తిరుపాల్, పుల్లన్న, వెంకటేశ్వర్లు, మధు చికెన్ సెంటర్ బి. మల్లికార్జున,పెంచికలపాడు , కృష్ణ, మాజీ జెడ్పిటిసి సుంకన్న,రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు రవికుమార్,సిపిఎం వెంకటరాముడు, భీష్ముడు, కాంట్రాక్టర్ రంగయ్య తదితరులు పాల్గొన్నారు.జిల్లా లో కురువలపై జరుగుతున్న దాడుల గురించి వివరించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.


