NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మందకృష్ణ మాదిగ జన్మదినం – ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

1 min read

హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండలంలోని  బాలాజీ పెట్రోలియం ఆవరణంలో ప్రజా నాయకుడు, తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి చిన్నహ్యాట శేషగిరి ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినం మరియు ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చిన్నహ్యాట శేషగిరి మాట్లాడుతూ, 1965 జూలై 7న తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా శాయంపేటలో జన్మించిన మందకృష్ణ మాదిగ సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడుతున్న ఉద్యమ నాయకుడని కొనియాడారు. దళితుల హక్కుల సాధనకు ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2025 సంవత్సరానికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించగా, 2025 మే 27న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆ అవార్డును అందుకోవడం ప్రతి దళితుడికి గర్వకారణమని అన్నారు.ఎమ్మార్పీఎస్ ఉద్యమం 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో కొద్దిమంది యువకులతో ప్రారంభమై, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మాదిగలు, మాదిగ అనుబంధ కులాల హక్కుల కోసం బలమైన ప్రజా ఉద్యమంగా ఎదిగిందన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరించి, అత్యంత వెనుకబడిన దళిత వర్గాలకు సముచిత న్యాయం చేయాలనే లక్ష్యంతో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దండోరా ఉద్యమం సాగిందని తెలిపారు.అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, సమాన అవకాశాల కోసం ఎమ్మార్పీఎస్ చేపట్టిన ఉద్యమం అనేక ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిందని శేషగిరి పేర్కొన్నారు. దళిత సమాజ హక్కుల సాధనలో మందకృష్ణ మాదిగ చేస్తున్న కృషి చిరస్మరణీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ప్రతినిత్యం బ్యూరో సీనియర్ జర్నలిస్టు హెచ్. చలపతి, చిన్నహ్యాట నాగరాజు, హెల్త్ నాగరాజు, వార్డు సభ్యుడు వరాల వీరేష్, వరాల మల్లయ్య, కొగిలతోట చెన్నప్ప, ప్రతినిత్యం విలేకరి హనుమంతు, దళిత యువ నాయకులు హనుమంతు, జార్జ్, మృత్యుంజయ, జనసేన మండల కో-కన్వీనర్ వరాల వీరేష్, తప్పిడి మల్లి, రవి, డ్రైవర్ మల్లి, రంగ, మార్లమడికి భాస్కర్, గోవిందరాజులు, ఎర్రిస్వామి గంగతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *