ఈవ్ టీజింగ్,ర్యాగింగ్ చేస్తే చర్యలు
1 min read
‘నంది కళాశాల’విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించిన పట్టణ సీఐ..
నందికొట్కూరు న్యూస్ నేడు: బాలికలపై ఈవ్ టీజింగ్ ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని నందికొట్కూరు పట్టణ సీఐ ఎం అశోక్ కుమార్ అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో నంది జూనియర్ కళాశాలలో విద్యార్థులకు’శక్తి యాప్’ మరియు మహిళా చట్టాల గురించి అవగాహన సదస్సు మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ బద్ధుల శ్రీకాంత్ అధ్యక్షతన జరిగింది.పట్టణ సీఐఅశోక్ కుమార్ విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మహిళలకు, బాల బాలికలకు ప్రత్యేకంగా ప్రభుత్వం శక్తి యాప్ తీసుకువచ్చిందని ప్రతి విద్యార్థినీలు తప్పనిసరిగా ఈ శక్తి యాప్ ను 7993485111 వాట్సాప్ నంబర్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని ఎవరైనా సరేఅమ్మాయిలను ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ మరియు అమర్యాదగా మాట్లాడితే 112,100 కు ఫోన్ చేయాలన్నారు.సైబర్ క్రైమ్ జరిగితే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులు తిరిగి పొందవొచ్చని అది కూడా జరిగిన 2 గంటల లోపు ఫిర్యాదు చేస్తే తప్పకుండా మీ అకౌంట్ లో నుంచి సైబర్ నేరగాళ్ళు కోట్టేసిన అమౌంట్ మీకు తిరిగి వస్తుందన్నారు. యువకులు బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు.తర్వాత కళాశాల ప్రిన్సిపాల్ బద్దుల శ్రీకాంత్ మాట్లాడుతూనేటి సమాజంలో యువత చెడు అలవాట్లకు గురికాకుండా చదువు పైన దృష్టి పెడితే అనుకున్న లక్ష్యాలను మీరు చేదించగలుగుతారని విద్యార్థులతో అన్నారు.ఈ కార్యక్రమంలో మన్సూర్, కానిస్టేబుల్ రసూల్,కళాశాల సిబ్బంది మరియు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.


