మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలు
1 min read
అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జీ మామిళ్ళపల్లి జయప్రకాష్ ,డిఎన్ ర్ అధ్వర్యంలో ర్యాలి
పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదంచేసిన కార్యకర్తలు అభిమానులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దివంగత ముఖ్యమంత్రి మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జీ మామిళ్ళపల్లిఅసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జీ మామిళ్ళపల్లి జయప్రకాష్ (జేపీ) అధ్వర్యంలో ఘనంగా ర్యాలి నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ తరపున పేదలకు దుప్పట్లు, అల్పాహారం కూడా పంపిణీ ఏర్పాటు చేశారు, స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉన్న వైస్సార్ కాంస్య విగ్రహానికి గజమాలను వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరుజిల్లా పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు (డి ఎన్ ర్ ) అలాగే పార్టీ అన్ని అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్దఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

