NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోగులకు పండ్లు పంపిణీ చేసిన వైసీపీ నాయకులు

1 min read

మిడుతూర్’లో ఘనంగా వైఎస్సార్ జయంతి..

మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మిడుతూరు పాత తహసిల్దార్ కార్యాలయం దగ్గర బుధవారం ఉదయం నాయకులతో కలిసి లోకేశ్వర్ రెడ్డి మరియు జెడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించి కేకును కట్ చేసి జై వైయస్సార్ అంటూ సంబరాలు చేసుకున్నారు.తర్వాత సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నబి రసూల్, ఎంపిటిసి హరి సర్వోత్తమ్ రెడ్డి,చిన్న రామచంద్రారెడ్డి, నాగ తులసి రెడ్డి,మల్లేశ్వర రెడ్డి,నారాయణరెడ్డి, రామకృష్ణ,అన్వర్ భాష, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *