NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైఎస్ ఆశయాల సాధనకు కట్టుబడి ప్రజా సేవలో ముందుకు సాగుతాం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలను మండల కన్వీనర్ పోతుదొడ్డి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బుధవారం వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి “జై వైఎస్సార్” నినాదాలతో సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమానికి, రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల అభ్యున్నతికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. వైఎస్ ఆశయాల సాధనకు కట్టుబడి ప్రజా సేవలో ముందుకు సాగుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మొట్టు వెంకటేశ్వరరెడ్డి, గడ్డం భువనేశ్వరరెడ్డి, బోరెడ్డి పుల్లారెడ్డి, బోరెడ్డి రామచంద్రరెడ్డి, బోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బోరెడ్డి రఘునాథ్‌రెడ్డి, రజినీకాంత్‌రెడ్డి, బోర మల్లికార్జునరెడ్డి, పర్వతం శ్రీనివాసరెడ్డి, బండ సోమశేఖర్, చిన్న సుంకయ్య,బండ రమణ,కొండయ్య, పాండు, ఎర్రిస్వామి, చంద్రశేఖర్‌రెడ్డి, రామమూర్తి, రంగస్వామి, జయరాయ్య, రామానాయుడు, మద్దయ్య, భాస్కర్, నాయుడు, నాగరాజు, నాగన్నతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *