NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్డు విస్తరణ పనులు నాణ్యతగా పూర్తి చేయండి

1 min read

పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జయసూర్య..

నందికొట్కూరు న్యూస్ నేడు: నందికొట్కూరు పట్టణంలో కేజీ రహదారిలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు నాణ్యతగా పనులు చేయించాలని అదేవిధంగా పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చూడాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అధికారులను మరియు కాంట్రాక్టర్ ను ఆదేశించారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ నుండి శ్లోక స్కూల్ వరకు 3 కోట్ల రూపాయలతో జరుగుతున్న రోడ్డు డివైడింగ్,సెంట్రల్ లైటింగ్,రోడ్డు విస్తరణ మరియు రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఉదయం ఎమ్మెల్యే పరిశీలించారు.నందికొట్కూరులో ఇంతవరకు ఎవరూ చేయనంత అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి,ఏఈ దినేష్ కుమార్,పట్టణ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి,సొసైటీ చైర్మన్, ముర్తుజావలి,వేణుగోపాల్, నాగ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *