భారీ ఎత్తున సౌండ్ బాక్సులు, హార్న్లు, మోడిఫైడ్ సైలెన్సర్ల స్వాధీనం
1 min read
ట్రాఫిక్‌కు అంతరాయం,అధిక శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న వాహనదారులకు ప్రత్యేక తనిఖీలు
ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్, ట్రాఫిక్ సిఐ లక్ష్మణరావు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు పాత బస్టాండ్ సెంటర్‌లో భారీ ఎత్తున సౌండ్ బాక్సులు,హార్న్లు, మోడిఫైడ్ సైలెన్సర్ల స్వాధీనం చేసుకుని సామగ్రిని పోలీసులు ధ్వంసం చేశారు.ట్రాఫిక్‌కు అంతరాయం, అధిక శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న పరికరాలపై ప్రత్యేక తనిఖీలు పలుచోట్ల నిర్వహించారు.జెసిబి సాయంతో స్వాధీనం చేసుకున్న సామగ్రిని పోలీసులు నడిరోడ్డుపై ధ్వంసం చేశారు.ప్రజలకు ఇబ్బంది కలిగించే శబ్ద పరికరాలపై రాజీ లేకుండా చర్యలు కొనసాగుతాయని ఆటో మరియు ద్విచక్ర వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి శబ్ద కాలుష్యాన్ని నివారించాలని వాహనదారులకు పోలీసుల విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, టూ టౌన్ సీఐ అశోక్ కుమార్, ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


