NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పందికొన రిజర్వాయర్ నుండి మండలానికి సాగునీరు ఇవ్వాలి…సిపిఎం

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:  ఈ సంవత్సరం తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పందికొన రిజర్వాయర్ నుండి దేవనకొండ మండలానికి సాగు నీరు ఇవ్వాలని సిపిఎం జిల్లా నాయకులు బి. వీర శేఖర్ డిమాండ్ చేశారు బుధవారం నాడు సిపిఎం పార్టీ వివిధ గ్రామాల రైతులతో కలిసి ఈ మేరకు డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు వీరశేఖర్, అశోక్ లు  మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్  ప్రారంభంలోనే మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతులను కలవర పరుస్తున్నాయని, ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. మూడు వారాలుగా వర్షం జాడ లేకపోవడంతో రైతుల వేదనా, బాధ వర్ణాతితంగా ఉందని పేర్కొన్నారు భూమిలో విత్తనాలు వేసి రైతుల ఆకాశం వైపు చూస్తున్నారని రైతులు మరింత నష్టపోక ముందే పందికొన రిజర్వాయర్ నుండి మండలానికి కనీసం వారం, పది రోజుల పాటు సాగునీరు ఇచ్చే ప్రయత్నం అధికారులు చేయాలని వారు కోరారు తద్వారా రైతుల కొంత ఉపశమనంగా ఉంటుందని ప్రభుత్వము మరియు అధికారులు  రైతుల బాధలు అర్థం చేసుకొని వెంటనే మండలంలోని పంటలకు సాగు నీరు ఇవ్వాలని వారు కోరారు ఇప్పటికే విపరీతంగా పెరిగిన ఎరువుల, పురుగు మందుల ధరలు, విత్తనాల ధరలు రైతుల నడ్డి విరుస్తున్నాయని రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఉచితంగా ఎరువులు విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు యూసుఫ్ భాష, నాగేంద్ర, అనిల్ కుమార్, శివ, వీరప్ప రెడ్డి, నాగన్న, రామాంజనేయులు, మహబూబ్బాషా, శ్రీనివాసులు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *