NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కలెక్టర్ కార్యాలయం ముందు జూలై 10న అంగన్వాడీల మహా ధర్నా

1 min read

సి డి పి ఓ లలిత కు వినతి పత్రం అందజేత 

న్యూస్ నేడు, పత్తికొండ:  ఈనెల 10న కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీల సమస్యల కోసం తలపెట్టిన మహా ధర్నా కార్యక్రమం కోసం ఐసిడిఎస్ కార్యాలయంలో సిడిపిఓ లలితకు సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్షురాలు చిట్టెమ్మ, ఆధ్వర్యంలో బుధవారం వినతిపత్రం అందజేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, అంగన్వాడీల కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక విధానాలు అమలు చేయాలని జూలై 10 కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టే కార్యక్రమానికి పత్తికొండ ప్రాజెక్టులో ఉన్న ప్రతి ఒక్క సెంటర్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. అంగన్వాడీల సమస్యల కోసం అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తుందన్నారు. కూడా లేదని అంగన్వాడీల పట్ల చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న విధానం బ్రిటిష్ విధానాన్ని తలపిస్తుందని అన్నారు. అంగన్వాడీల సంక్షేమం కోసం ఏ ఒక్క పని చేయని ప్రభుత్వం ఎన్నికల లో భాగంగా హామీలు ఇవ్వడం వాటిని మరవడం చంద్రబాబు నాయుడు పనిగా పెట్టుకున్నారని అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 45 రోజులు నిరాహార దీక్షలు చేసిన సమయంలో అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులు సిఐటియు అంగన్వాడీ ల నిరాహార దీక్ష  సెంటర్లకు వచ్చి మీ న్యాయమైన డిమాండ్లు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తామని చెప్పిన నాయకులంతా నేడు ఎక్కడికి పోయారని వారు ప్రశ్నించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *