NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హాస్టల్ విద్యార్థుల డైట్ ఛార్జీల పెంపుపై సీఎం కు కృతజ్ఞతలు తెలిపిన వై. నాగేశ్వర యాదవ్

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల డైట్ ఛార్జీలను పెంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉమ్మడి కర్నూలు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై. నాగేశ్వర యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.శుక్రవారం బనగానపల్లెలో నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వై. నాగేశ్వర యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈ నెల 26, 27 తేదీలలో ఢిల్లీలో నిర్వహించనున్న బీసీల సమస్యలపై జాతీయ సెమినార్ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేశారు. అలాగే ఆ కార్యక్రమానికి రాష్ట్ర ఎంపీలు హాజరై బీసీలకు మద్దతు తెలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు డైట్ ఛార్జీలను పెంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే బీసీ విద్యార్థుల అభివృద్ధి కోసం గురుకుల పాఠశాలలను మంజూరు చేసి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం డీసీఎంఎస్‌లో నెలకొన్న పరిస్థితులతో పాటు ప్రస్తుత ఎస్ ఐఆర్ మరియు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించినట్లు వై. నాగేశ్వర యాదవ్ తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *