NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆలూరు ప్రజలకు అండగా ఎల్లప్పుడూ ఉంటా – ఈబీజీ గోవింద గౌడ్

1 min read

హోళగుంద న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తానని ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఈబీజీ గోవింద గౌడ్ తెలిపారు.ప్రజా సేవే తన లక్ష్యమని, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల ఆశీర్వాదం, సహకారంతో ఆలూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు తన వంతు బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానని ఈబీజీ గోవింద గౌడ్ స్పష్టం చేశారు.ఆలూరు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా తాను ముందుండి అండగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *