విజయ స్కిన్ హాస్పిటల్ డాక్టర్:దశిక సుబ్బారావు హాంగ్ కాంగ్ పర్యటన
1 min read
నేడు తిరిగి వచ్చిన సందర్భంగా స్వదేశాగమన ఆత్మీయ ఆహ్వాన అభినందన సభ
లయన్స్ జిల్లా గవర్నర్ కి పలువురు లైన్స్ నాయకులు ఘన స్వాగతం
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: లయన్స్ జిల్లా 316జి గవర్నర్ గా ఎన్నికైన విజయ స్కిన్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్: దశిక సుబ్బారావు 3 జులై నుండి 7 జులై వరకు హాంగ్ కాంగ్ లో జరిగిన ఇంటర్నేషనల్ సమావేశంలో పాల్గొని లయన్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు మార్క్ ఎస్ లియోన్ నేతృత్వంలో జిల్లా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసి లయన్స్ ఇంటర్నేషనల్ సేవా ప్రణాళికలపై అవగాహన కల్పించుకొని నేడు ఏలూరుకి తిరిగి వచ్చిన సందర్భంగా ఏలూరు గ్రీన్ సిటీ లో గల లయన్స్ భవనం నందు జిల్లా లయన్స్ నాయకులచే ఏర్పాటుచేసిన స్వదేశాగమన ఆత్మీయ ఆహ్వాన మరియు అభినందన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్: సుబ్బారావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మన జిల్లాలో ఉన్న శాశ్వత ప్రాజెక్టులైన డయాలసిస్,కంటి హాస్పిటల్స్, జనరల్ హాస్పిటల్స్, కమ్యూనిటీ హాల్స్ వంటివి అత్యుత్తమ ప్రమాణాలతో నడుస్తున్నాయని, దీనికి కారకులైన మన జిల్లా పూర్వ గవర్నర్ లు ఇతర లయన్స్ అధికారులు,సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే సేవారంగంలో ఈ సంవత్సరం కూడా మన జిల్లా ప్రతిభ నలుదిశలా వ్యాపింప చేసే విధంగా అందరం కలిసి కృషి చేద్దామని అన్నారు.ఈ సందర్భంగా పదవీ స్వీకరణ మహోత్సవం పూర్తి చేసుకొని వచ్చిన డాక్టర్ సుబ్బారావు,డాక్టర్:సరస్వతి దంపతులను లయన్స్ జిల్లా నాయకులు ఘనంగా సత్కరించారు.ఏలూరు హేలాపురి లయన్స్ క్లబ్ అధ్యక్షులు కూరపాటి సత్యనారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి ఉప గవర్నర్ ఆర్.వి.ఎస్. సూర్యనారాయణ రాజు,రెండొవ ఉప గవర్నర్ వి.సత్య స్వరూప్, జిల్లా పూర్వ గవర్నర్ లు కె.వి కిషోర్ కుమార్,వి మురళీ మోహన్ రావు,డాక్టర్ పి విజయ భాస్కర్ రెడ్డి,డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ ఎల్.వెంకటేశ్వరరావు,డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ కె.బి.రావు, జిల్లా నాయుకులు కూర్మా శ్రీనివాస్,డి.హేమసుందర్,కొరిపల్లి సత్యనారాయణ,వి. రత్నకుమార్, రీజియన్ చైర్మన్లు దేవరకొండ వెంకటేశ్వర్లు,పేరేచర్ల మురళీ కృష్ణంరాజు,పి.వెంకన్న బాబు, నాయుకులు ఎం.శ్రీహరి,వి. విష్ణుకుమార్,జోన్ చైర్మన్లు వి.సురేష్,కడియం ప్రసాద్, శేషుకుమార్,స్థానిక నాయుకులు డి.రమాదేవి,ఎస్.సుజాత, శ్రీహరికోటి,బి.వి.వి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


