NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలులో “హైకోర్టు బెంచ్” ఏర్పాటు చేయాల్సిందే 

1 min read

పత్తికొండలో కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు 

న్యూస్ నేడు, పత్తికొండ: కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల్సిందేనని  పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధుబాబు, సీనియర్ న్యాయవాదులు కారప్ప, గోపాల్ రెడ్డి, యల్లారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధుబాబు ఆధ్వర్యంలో కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బనగానపల్లి లో జరిగే బహిరంగ సభలో కర్నూల్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  బహిరంగంగా  ప్రకటన చేయాలని తెలిపారు. రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని,  అలాగే జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్  10000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ కర్నూలు జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించి నిరసనలు తెలుపుతున్నారని వివరించారు. అందులో భాగంగా ఈ నెల 10 తేదీ కూడా పత్తికొండ కోర్టు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదులు మల్లికార్జున, నాగేష్, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, హుళ్తేన్న, నాగభూషణం రెడ్డి, పంపాపతి, సూరాజ్, ప్రసాద్, మహేష్, లక్ష్మన్న,  శ్రీకాంత్ రెడ్డి, భాస్కర్, వాసు, అరుణ్, వలి, మధు, రాజాక్, సాంబ, హరి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *