NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కురువల జోలికి వస్తే సహించం

1 min read

కురువ ప్రజాప్రతినిధులు అవమానం చేస్తే మీకు రాజకీయ సమాధి  

 కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు.

కర్నూలు,న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉదయం పెదపాడు సమీపంలోని శ్రీ బీర లింగేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా లో కురువలపై దాడులు అధికమయ్యాయని, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, జిల్లా పోలీసు అధికారులు దాడులు చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవలెనని చెప్పారు.జిల్లాలోని కురువలు అందరు ఐకమత్యంగా ఉండాలని,కురువల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. కర్నూలు ఎంపీ  బస్తిపాటి నాగరాజు అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలవడం జిల్లాలోని కొద్దిమంది నాయకులు జీర్ణించుకోలేక ఎంపి ని అగౌరవపరుస్తూ ఆ దిశగా ఎమ్మెల్యేలు,ఇంచార్జీల తీరు చూస్తుంటే చాలా అభ్యంతర కరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.  మీ తీరు మార్చుకోవాలని లేని పక్షంలో మీకు రాజకీయ సమాధి కడుతామని హెచ్చరించారు. కురువ  కులస్థుల పట్ల కూటమి నాయకుల తీరు మారక పోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల లో కురువల సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన అన్నారు. మా మధ్యనే చిచ్చు పెడుతున్నారని ఈ విషయాన్ని కులజులు అందరూ తెలుసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి,జిల్లా ఉపాధ్యక్షులు బి వెంకటేశ్వర్లు,కె. టి. ఉరుకుందు,పెద్దపాడు ధనుంజయ, సహాయ కార్యదర్శి బీ.సీ. తిరుపాల్ , పెద్దపాడు పుల్లన్న, నగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి బి. రామకృష్ణ,బి.బాలరాజు, వెంకటేశ్వర్లు, శ్రీరాములు, చిరంజీవి,మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *