పార్లమెంట్ లో ఎస్సీ క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించి పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి
1 min read
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని పెరికె వరప్రసాదరావు,ఏలూరు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: బిషప్ శాంతి సాగర్ గృహములో జరిగిన మీటింగ్ లో ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని పాస్టర్స్ పై దాడి చేసే వారిపై చర్చస్పై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలనిన్యాయవాది, నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు కోరారు. బిషప్ శాంతి సాగర్ మాట్లాడుతూ 100 సంఘాలనుండి 1000 పత్రాలపైన సంతకాలు సేకరించించి మాజీ చీఫ్ జస్టిస్ కెజీ బాలకిష్ణన్ కి పంపెందుకు ఈ సమావేశంలో 25 మందికి 250 పత్రాలు అందించారు. మిగతా 75 చర్చిలకు ఈ వారంలో పంపి సంతకాలు సేకరించనున్నామని తెలిపారు.త్వరలో ఆకివీడు చర్చిలపైన మైక్ ల పునరుద్దరణ చేపట్టాలని ప్రణాళిక చేస్తున్నామన్నరు.దైవసేవకులతో పాటు లేమెన్ 300 మందిని ఈ గ్రూపులో చేర్చి క్రైస్తవ సమస్యలపై మత స్వేచ్ఛ హక్కులపై న్యాయ పోరాటాము కొనసాగిస్తామన్నరు. 1950 ప్రెసిడెంట్షియల్ ఆర్డర్ సవరించాలని ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ లో ఎస్సీ క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించి పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని పెరికె వరప్రసాదరావు, ఏలూరు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేశారు.స్థానిక ఏలూరు సంఘాలు కొన్న అసైన్డ్ భూమి రెండు ఎకరాలు ప్రభుత్వం గుర్తించి సమాధుల తోటగా మునిసిపల్ రికార్డ్స్ లో చేర్చి ప్రస్తుత నిర్వహణ భాద్యతలు నిర్వహిస్తున్న కమిటీ కి అధికారిక ఉత్తర్వులు ఇచ్చేట్టు త్వరగా చర్యలు చేపట్టాలని కోరారు. వివిధ సంఘాల పాస్టర్ లు,ఉపదేషులు, క్రిస్టియన్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.


