NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డా. రాయపాటి శ్రీనివాస్ కు ఘనంగా సన్మానం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన జిల్లా 117s 2026–2027 సంవత్సరానికి జిల్లా గవర్నర్‌గా డా. రాయపాటి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా   కలెక్టరేట్  ప్రాంగణంలో ఉన్న  జిల్లా  ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా  అధ్యక్షులు లయన్ మురారి శంకరప్ప,రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ లయన్  గుర్రం త్రినాథ్ కుమార్,స్పెషల్ బెటాలియన్ డి.ఎస్పి. మహబూబ్ బాషా,రిటైర్డ్ గనులు మరియు భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్  ఇంటాక్  మేనేజర్ లయన్  తాళ్లపాక నటరాజ,మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేజీ గంగాధర రెడ్డి,జయన్న, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ కార్యదర్శి లయన్ తిరుపతి సాయి,బీమా ఎల్లా గౌడ్,రామకృష్ణ తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా 117ఎస్ పరిధిలోని అన్ని క్లబ్ సభ్యులు, సేవాభావం కలిగిన ప్రతి ఒక్కరూ సంస్థ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *