చింతలపూడి లో అమృత్ పథకం ద్వారా త్రాగు నీటి కి శాశ్వత పరిష్కారం
1 min read
ఎమ్మెల్యే రోషన్ కుమార్
56 కోట్లతో త్రాగు నీటి సరఫరా పథకానికి ఎమ్మెల్యే భూమి పూజ
త్రాగునీటి సమస్య కు శాశ్వత పరిష్కారం,ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నీరు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: చింతలపూడి నియోజకవర్గం లో 5 రక్షిత నీటి పథకాలు( ట్యాంక్) ఏర్పాటు చేయడం ద్వారా పట్టణంలో అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా చేయనున్నట్లు చెప్పారు.చింతలపూడి పట్టణంలో త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నీటిని అందించేందుకు 56 కోట్ల వ్యయంతో అమృత్ కింద త్రాగు నీటి పథకానికి భూమి పూజ చేయడం జరిగింది.ముఖ్యమంత్రి ముందు చూపుతోరాబోయే 15 సంవత్సరాల వరకు సరిపోయే విధంగా నీటి పథకాలు ఏర్పాటుకు ప్రణాళికలు రచించారన్నారు. నియోజవర్గ అభివృద్ధికి తాను అంకితం ప్రజల సహకారం కృషి చేస్తున్నట్టు రోషన్ కుమార్ పేర్కొన్నారు. చింతలపూడిలో త్వరలో వంద పడకల ఆసుపత్రి భవన ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. అదేవిధముగా చింతలపూడిలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ప్రతిపాదనలు పంపానన్నారు. చింతలపూడి నియోజకవర్గ ప్రజల అవసరాలను గుర్తించి రహదారులు అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు రోషన్ కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అమృత్ డైరెక్టర్ పాండురంగారావు, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


