NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“రహదారి భద్రత నియమాల పై విద్యార్థులకు  అవగాహన సదస్సు “

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు నగర ట్రాఫిక్ సిఐ మన్సరుద్దీన్ గారి ఆధ్వర్యంలో స్థానిక కట్టమంచి రామ లింగారెడ్డి మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్, ఎపి యస్పి సెకండ్ బెటాలియన్ నందు రహదారి భద్రతా నియమాలపై ఏర్పాటు చేసిన సదస్సు కు ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి హాజరయ్యారు.  జడ్జి మాట్లాడతూ  సమాజంలో  ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలను పాటించాలని విద్యార్థులకు, స్కూల్ టీచర్లకు  కోరారు. హెల్మెట్, సిటీ బెల్టు ధరించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగిన ప్రాణాలను రక్షించుకోవచ్చు అని తెలిపారు. ఓవర్ లోడు వేసుకుని వాహనం నడపరాదని తెలిపారు. ప్రతి సంవత్సరం రహదారి ప్రమాదంలో అనేకమంది ప్రాణాలను కోల్పోతున్నారని రహదారి నియమాలను పాటిస్తూ ప్రాణాలు కాపాడుకోవాలని తెలిపారు. అనంతరం కర్నూల్ ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో మైనర్లు వాహనాలు నడపరాదని తెలిపారు.అట్టి మైనర్లు కారు గాని బైకు గాని నడుపుతూ పట్టుపడితే ఆ వాహన యజమానులకు లేదా అతని తల్లిదండ్రులకు Rs. 25, 000/- వేల రూపాయల జరిమానాలతో పాటు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని తెలిపారు. తాగి వాహనం నడిపితే Rs.10000/- రూపాయల జరిమానాలతో పాటు గరిష్టంగా ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు.అనంతరం రహదారి భద్రత నియమాలపై విడుదల చేసిన పోస్టర్లను జడ్జి గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ మరియు ట్రాఫిక్ ఎస్ఐ, లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్,  కట్టమంచి రామలింగారెడ్డి మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ హెడ్మాస్టర్  వెంకటరెడ్డి, టీచర్లు భాస్కర్ హరికృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *