పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని తనిఖీ చేసిన న్యాయమూర్తి”
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి,ఈ రోజు అనగా 22-07-2026 న మద్దూర్ నగర్ నందు గల వేదాస్ పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. కార్యాలయాలకు సంబందించిన రిజిస్టర్ లను పరిశీలించి అక్కడి సౌకర్యాలు, పరిశుభ్రతను పరిశీలించారు.అక్కడి వారిని అడిగి వారికీ అందించే భోజన, వసతి, వైద్య సదుపాయలను గురించి తెలుసు కొని సంతృప్తి వక్తం చేసారు. వృద్ధులకు నిరాశ్రయులకు లీగల్ అవేర్నెస్ క్యాంపు నిర్వహించి ఏవైనా సమస్యలుంటే లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నెంబర్ 15100కు కాల్ చేస్తే వారి చట్ట పరమైన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ నిరాశ్రయుల వసతి గృహ లీగల్ ఎయిడ్ క్లినిక్ న్యాయవాది రాంపుల్లయ్య, వేదాస్ వసతి గృహ నిర్వాహకురాలు పరమేశ్వరి తదితరులు పాల్గొనారు.


