వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి
1 min read
కల్లురు, న్యూస్ నేడు: కల్లూరు మండలంలోని తడకపల్లె, బస్తిపాడు గ్రామలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రత్తి పంటలో మెళకువలు, అంతటా పంటలు మరియు తక్కువ కాలపరిమితి కంది, సజ్జ మరియు కొర్ర పంటలు సాగు చేసుకోవాలని రైతులకు తెలియచేస్తూ , ప్రస్తుతం ఖరీఫ్ 2026 సీజన్ లో సాగు చేసిన పంటలకు వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని బ్యాంకు ద్వారా రుణం తీసుకున్న రైతులు ప్రీమియం చెల్లించుకోవాలని బ్యాంకు రుణం పొందని రైతులు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఈ నెల 31 వరకు కాలపరిమితి ఉన్నందున రైతులు తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి విష్ణు వర్ధన్ రెడ్డి తెలియచేశారు ఇందులో గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ పెద్దలు మరియు రైతులు పాల్గొన్నడం జరిగినది.


