విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
1 min read
– ప్రత్యేక పూజల్లో వైఎస్సార్సీపీ నాయకుల పాల్గొనడం
రాష్ట్ర ప్రజల సుఖశాంతి, ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అమ్మవారిని ప్రార్థించిన ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
ఆలూరు న్యూస్ నేడు: విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల సుఖశాంతి, ఆయురారోగ్యాలు, అలాగే ఆలూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం అమ్మవారిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు వైకుంఠం మల్లికార్జున చౌదరి కూడా పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షికి వేద ఆశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



