బిసివై పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వేప మొక్కల పంపిణీ
1 min read
ఎల్లార్తి గ్రామ జెడ్పీహెచ్‌ఎస్‌లో “వన భారత్” కార్యక్రమం నిర్వహించిన జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్
హొళగుంద న్యూస్ నేడు: బిసివై పార్టీ 3వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హొళగుంద మండలంలోని ఎల్లార్తి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో “బీసీవై పార్టీ వన భారత్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ సూచనల మేరకు కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్ విద్యార్థులకు వేప, బొప్పాయి, కణిగ, మొలక్కాయ మొక్కలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎల్లార్తి అర్జున్ మాట్లాడుతూ “వృక్షో రక్షతి రక్షితః – ప్రకృతిని ప్రేమిద్దాం… పచ్చని భవిష్యత్తును నిర్మిద్దాం” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కల పంపిణీ కేవలం కార్యక్రమంగా కాకుండా భావితరాల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించే ఉద్యమంగా మారాలని ఆకాంక్షించారు.చిన్నారుల చేత మొక్కలు నాటించడం ద్వారా ప్రకృతిపై ప్రేమ, పర్యావరణ పరిరక్షణపై బాధ్యత, సామాజిక సేవ పట్ల అవగాహన పెరుగుతుందని తెలిపారు. “నేడు ఒక చిన్నారి నాటిన వేప మొక్క… రేపటి తరాలకు ఆరోగ్యం, నీడ, స్వచ్ఛమైన వాతావరణానికి నాంది అవుతుంది” అని విద్యార్థులకు సందేశమిచ్చారు.పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భావితరాలను భాగస్వాములను చేయాలని, ప్రతి విద్యార్థి తాను నాటిన మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని మొక్కల పంపిణీ కార్యక్రమానికి సహకారం అందించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులందరికీ బిసివై పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు.



