NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“ఇంటింటికి కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు”

1 min read

ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఈబీజీ గోవింద్ గౌడ్

ప్రజా సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తామని హామీ

హోళగుంద న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “ఇంటింటికి కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు” కార్యక్రమం హొళగుంద మండలంలోని గోహోనల్, ఎం.డి.హళ్లి గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు.ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీమతి వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈబీజీ గోవింద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 53, 54 బూత్‌ల పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలతో మమేకమయ్యారు.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ వివరించారు. ముఖ్యంగా రూ.4,000 ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, అన్న క్యాంటీన్లు, విద్యా సంస్కరణలు, వైద్య సేవల విస్తరణ, రైతు సంక్షేమ పథకాలు, మహిళలు, యువత, విద్యార్థులు, రైతులు, కార్మికుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.అలాగే ప్రభుత్వం ప్రజల కోసం తీసుకున్న సంక్షేమ నిర్ణయాలు, గ్రామీణాభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత వంటి అంశాలను ప్రజలకు వివరించి, ప్రభుత్వ పనితీరుపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా అర్హులైన ప్రజలకు చేరుతోందని తెలిపారు. ప్రజల సమస్యలను వినే, స్పందించే, పరిష్కరించే ప్రభుత్వం ఇదేనని పేర్కొంటూ ప్రభుత్వంపై తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.అనంతరం ఈబీజీ గోవింద్ గౌడ్ ప్రతి ఇంటికి వెళ్లి గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటిని ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీమతి వైకుంఠం జ్యోతి దృష్టికి వెంటనే తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఎస్. పంపపతి, యారిస్వామి, జనసేన మండల కన్వీనర్ అశోక్, బీజేపీ మండల కన్వీనర్ ప్రసాద్, టీడీపీ కో-కన్వీనర్ జకీర్, చౌల రెడ్డి, కురవ నాగరాజు, వీరనాగప్ప, శరణప్ప, మాల గోపాల్, వెంకటరాముడు, హుస్సేన్ పీరా, రామాంజి, దీడి నాగప్ప, దీడి మలయ్య, యువ నాయకుడు ఈబీజీ రాజేంద్ర గౌడ్, టీడీపీ మండల మైనార్టీ అధ్యక్షులు ముల్లా మొయిన్, వెంకటేష్, కో-క్లస్టర్ ఇన్‌చార్జ్ రారవి సిద్ధు, పవన్, 34వ బూత్ ఇన్‌చార్జ్ మలయ్య, కానయ్య, ఈబాదుల్లా, జనసేన నాయకుడు వెంకటేష్, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *