NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోళగుంద మండలంలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

1 min read

హోళగుంద న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని హోళగుంద మండలంలో శనివారం ఘనంగా నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు చేరవేశారు.ఆలూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి ఆదేశాలు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్ మార్గదర్శకత్వంలో హొలగుంద మండలంలోని ఇంద్రనగర్ కాలనీలోని బూత్ నంబర్–45 పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బూత్ ఇన్‌చార్జి, మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య, తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి చిన్నపేట శేషగిరి రాజా, పంపాను గౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి నెలా నిరంతరాయంగా పెన్షన్లు అందించడం ద్వారా వారి జీవితాల్లో భరోసా కల్పిస్తోందని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, శివకృష్ణ నాయక్, టిడిపి నాయకులు హనుమంతు, కురువ మళ్లీ, జంగల్ లక్ష్మన్న, కురువ మల్లి, జనసేన నాయకుడు వీరేష్, ల్యాబ్ గిరి, వలి భాష, డ్రైవర్ మళ్లీ, రామయ్యతో పాటు టిడిపి, జనసేన, బీజేపీకి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీలో సహకరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *