రోబోట్ తో గుండె మైట్రల్ వాల్వ్ మార్పిడి
1 min read
5 గంటలకు పైగా సర్జరీ- హైదరాబాద్ లోనే అరుదైన సర్జరీ
హైదరాబాద్, న్యూస్ నేడు : కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి వైద్యులు రోబోటిక్ సహాయంతో మైట్రల్ వాల్వ్ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. రాజమండ్రికి చెందిన 37 ఏళ్ల యువకుడికి చేసిన ఈ శస్త్రచికిత్స గచ్చిబౌలి కిమ్స్‌లో తొలిసారి నిర్వహించబడటమే కాకుండా, హైదరాబాద్‌లో అత్యాధునిక మినిమల్ ఇన్వేసివ్ గుండె శస్త్రచికిత్సల్లో మరో మైలురాయిగా నిలిచింది.శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను రోబోట్ సర్జరీ చేసిన చీఫ్ కార్డియోథొరాసిక్, రోబోటిక్ మరియు మినిమల్ ఇన్వేసివ్ సర్జన్ డా. నిసర్గ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి ప్రాంతానికి చెందిన రొయ్యల ఎగుమతి సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న 37 ఏళ్ల యువకుడు చాలా కాలంగా దీర్ఘకాలిక రుమాటిక్ గుండె వ్యాధి కారణంగా తీవ్రమైన మైట్రల్ స్టెనోసిస్తో బాధపడుతున్నాడు. అంటే గుండె ఎడమ భాగంలో వాల్వ్ ఎడమ ఎట్రియం నుంచి ఎడమ వెంట్రికల్కు రక్తం సులభంగా వెళ్లేలా తెరుచుకుంటుంది. కానీ వాల్వ్ మందపడి లేదా అతుక్కుపోయి ఇరుకుగా మారితే రక్త ప్రవాహం తగ్గిపోతుంది. దీనినే మైట్రల్ స్టెనోసిస్ అంటారు. దీని వల్ల తీవ్రమైన సమస్య ఏర్పడుతుంది. ఈ శస్త్రచికిత్స బృందంలో కార్డియాక్ సర్జన్ డా. వినీత్, కార్డియాక్ అనస్తీషియాలజిస్టులు డా. దివ్య, డా. గోరింత, డా. భవాని, సీనియర్ సర్జికల్ అసిస్టెంట్ మనోహ్, సీనియర్ క్లినికల్ పెర్ఫ్యూషనిస్టులు దయాకర్ స్వామి, జగన్మోహన్, జూనియర్ పెర్ఫ్యూషనిస్ట్ అభిషేక్ పాల్గొన్నారు. హైదరాబాద్‌లో అత్యాధునిక రోబోటిక్ గుండె శస్త్రచికిత్సలకు కిమ్స్ గచ్చిబౌలి కేంద్రంగా ఎదుగుతోందని, రోగులకు ప్రపంచ స్థాయి మినిమల్ ఇన్వేసివ్ చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు.


