బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ
1 min read
హోళగుంద న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పథకం కింద హొళగుంద మండలంలోని బీసీ కాలనీ 43వ బూత్ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ సంక్షేమ పాలనను అందిస్తోందని పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెలా వారి ఇంటి వద్దకే పెన్షన్లు అందించడం ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది అగ్రికల్చర్ శివనాయక్, రాజు నాయక్, మాజీ ఎంపీటీసీ ఎర్రస్వామి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుడగజంగల్ రామాంజి, పంచగుండా వెంకటేష్, గోవిందు, రామయ్యతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


