అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
1 min read
సమస్యలు వెంటనే పరిష్కరించండి
పింఛన్ల పంపిణీ..’ఇంటింటికీ టీడీపీ’లో పాల్గొన్న ఎమ్మెల్యే..
మిడుతూరు(నందికొట్కూరు)న్యూస్ నేడు: కడుమూరు గ్రామంలో ఉన్న సమస్యలను చూసిన ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో శనివారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ నగదును ఎమ్మెల్యే మరియు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి అందజేశారు. తర్వాత బీసీ,మైనారిటీ, ఎస్సీ కాలనీల్లో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి గత రెండేళ్ల ప్రభుత్వ పాలనలో ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. గ్రామ వీధుల్లో వెళ్తుండగా త్రాగునీటి పైపు లీకేజీలతో నీరు వృధా పోవటం, డ్రైనేజీలో చెత్త చెదారం, ఉర్దూ జిల్లా పరిషత్ పాఠశాల వద్ద డ్రైనేజీ కాల్వ అస్తవ్యస్తంగా ఉండటంతో ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.నీరు వృధా అవుతుంటే మీరేం చేస్తున్నారు వెంటనే పైపు లీకేజీలు డ్రైనేజీని శుభ్రం చేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వంలోనే ప్రజలకు అన్ని విధాలుగా ప్రజలకు అండగా ఉంటుందని అంతేకాకుండా ఇచ్చిన హామీలను అన్నింటిని ప్రభుత్వం నెరవేరుతుందని ఎమ్మెల్యే ప్రజలతో అన్నారు.
నూతన సబ్ సెంటర్ మంజూరు చేయండి
ఎన్నో సంవత్సరాలుగా ఆరోగ్య కేంద్రంలోనే చికిత్సలు అందిస్తున్న సబ్ సెంటర్ ను ఎమ్మెల్యే పరిశీలించారు.పాత భవనంలోనే గర్భవతులకు బాలింతలకు చికిత్సలు అందిస్తున్నామని డాక్టర్ రాజు మరియు ఆశా కార్యకర్తలు ఎమ్మెల్యేకు వివరించగా నూతన సబ్ సెంటర్ మంజూరుకు పంచాయతీరాజ్ ఏఈ ప్రతాప్ రెడ్డిని ఎమ్మెల్యే ఆదేశించారు.అదేవిధంగా ఒకరికి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, ఎంపీడీవో దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, వంగాల శివరామిరెడ్డి సంపంగి రవీంద్రబాబు గ్రామ నాయకులు సుధాకర్ రెడ్డి, ఇద్రిస్,మగ్బుల్ అహ్మద్ మరియు అధికారులు పాల్గొన్నారు.



